calender_icon.png 2 October, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. 69 మంది మృతి

02-10-2025 12:23:57 AM

సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో మంగళవారం రాత్రి సంభవించిన భారీ భూ కంపం తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ భూ కంపం రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు కావడంతో 69 మంది ప్రాణాలు కోల్పోగా 147 మంది గాయపడ్డారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.