calender_icon.png 2 October, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖతార్ పౌరులకు నెతన్యాహు క్షమాపణలు

02-10-2025 12:26:01 AM

వాషింగ్టన్ : హమాస్ నేతలే లక్ష్యంగా ఇటీవల దోహాపై దాడులు చేసినందుకు తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు సోమవారం ఖతార్ దేశ పౌరులకు క్షమాపణలు తెలిపారు. ఈ సన్నివేశం వాషింగ్టన్‌లోని శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో చోటుచేసుకున్నది. ఫోన్ కాల్ ద్వారా నెతన్యాహు ఖతార్ ప్రభుత్వ పెద్దలకు క్షమాపణలు చెప్పారు. అందుకు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను తాజాగా వైట్‌హౌస్ విడుదల చేసింది. ట్రంప్ పట్టుబట్టిమరీ నెతన్యాహుతో క్షమాపణలు చెప్పించినట్లు అంతర్జాతీయ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది.