04-11-2025 02:25:45 PM
							హైదరాబాద్: ఇటీవల మంత్రివర్గంలో చేరిన మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌కు(Mohammad Azharuddin) తెలంగాణ ప్రభుత్వం శాఖలు కేటాయించింది. మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు( Minority Welfare and Public Enterprises) కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ (పోల్.బి) శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నిర్వహించిన పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ పోర్ట్‌ఫోలియో, గతంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) పర్యవేక్షించిన మైనారిటీల సంక్షేమ పోర్ట్‌ఫోలియోను మంత్రి అజారుద్దీన్‌కు(Azharuddin) అప్పగిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా ప్రమాణం చేసినందుకు సంతోషంగా ఉందని, తనకు ఏ శాఖలను కేటాయించిన అంకితభావంతో నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.
