calender_icon.png 4 November, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్గొండ జిల్లాలో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

04-11-2025 08:22:54 AM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వరస బస్సు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నల్గొండ జిల్లా(Nalgonda district) వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సమీపంలో నార్కెట్ పల్లి- అద్దంకి హైవేపై(Narketpally-Addanki Highway) మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రావెల్స్ బస్సు ఏపీ నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తోంది. వేగంగా దూసుకొచ్చిన ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ట్రాక్టర్ ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నలుగురు కూలీలకు గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్సు(Travels bus) ఢీకొనడంతో ట్రాక్టర్ మూడు పల్టీలు కొట్టి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ కు ప్రాణాపాయం తప్పింది. గాయపడిన నలుగురు కూలీలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ మద్య కాలంలో భారీగా బస్సు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర లారీ ఢీకొని భారీగా ప్రాణనష్టం సంభవించిన విషయం తెలిసిందే.