04-11-2025 02:30:08 PM
							న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమానంలో మంగళవారం సాంకేతిక సమస్య తలెత్తింది. దేశరాజధాని ఢిల్లీ నుంచి బెంగళూరు ఎయిర్ ఇండియా(AI2487) విమానం ఇవాళ ఉదయం బయల్దేరింది. కానీ టేకాఫ్ అయిన కాసేటప్పటికే విమానంలో టెక్నికల్ సమస్య రావడంతో అప్రమత్తమైన పైలట్ ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు తెలియజేశారు. దీంతో అధికారులు అప్రమత్తమైన అత్యవసర ల్యాండింగ్ కోసం విమానాన్ని భోపాల్ మళ్లించారు. విమానం భోపాల్ సురక్షితంగా ల్యాడ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఏడాది జూన్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం తర్వాత ఈ సంస్థకు చెందిన పలు విమానంలో వరుసగా టెక్నికల్ సమస్యలు వస్తున్న విషయం తెలిసిందే.