calender_icon.png 4 November, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంతో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ

04-11-2025 02:50:14 PM

హైదరాబాద్: జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం భేటీ అయ్యింది. డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో ఇవాళ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(GCC) ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి జర్మనీ బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు.

హైదరాబాద్ డ్యుయిష్ బోర్స్(Deutsche Borse) కంపెనీ జీసీసీ ఏర్పాటుతో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు వారు వెల్లడించారు. హైదరాబాద్ లో జర్మనీ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించేందుకు సహకరించాలని వారిని కోరినట్లు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ భేటీలో అమిత దేశాయ్, డ్యుయిష్ బోర్స్ సీఐఓ/సీఓఓ డాక్టర్ క్రిస్టోఫ్ బోమ్, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.