calender_icon.png 3 May, 2025 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాకిస్థాన్‌పై ఆర్థిక దాడి?

03-05-2025 02:43:13 AM

  1. ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే జాబితాలో చేర్చే యత్నం
  2. ఐఎంఎఫ్ ప్యాకేజీని అడ్డుకునేలా వ్యూహాలు
  3. సరిహద్దుల వద్ద ఆగని పాక్ కాల్పులు
  4. వాఘా సరిహద్దు మళ్లీ తెరిచిన పాక్

న్యూఢిల్లీ, మే 2: ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తూ వెన్ను దన్నుగా నిలుస్తున్న పాకిస్థాన్‌ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని భార త్ యోచిస్తోంది. ఇందుకోసం అంతర్జాతీయంగా పాక్‌కు ఎటువంటి ఆర్థిక సాయం అందకుండా ప్రయత్నాలు ప్రారంభించింది. రెండు ఫైనాన్షియల్ స్ట్రుక్స్ చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. జీటు7 దేశాలు, ఐరోపా కమిషన్ కలిసి 1989 లో ప్రారంభించిన ఎఫ్‌ఏటీఎఫ్ (ఫైనాన్షియ ల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్) గ్రే జాబితా లోకి పాకిస్థాన్‌ను చేర్చేలా వ్యూహాలు రచిస్తోంది.

ఇది వరకు కూడా పాక్ ఎఫ్‌టీఎఫ్ గ్రే జాబితాలో ఉండేది. ఇక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) నుంచి ఏడు బిలియన్ డా లర్ల ఆర్థిక ప్యాకేజీ కోసం పాకిస్థాన్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్యాకేజీ కూడా దాయాది దేశానికి అందకుండా చేసేందుకు ఆందోళనలు వ్యక్తం చేయనుంది. పాకిస్థాన్ డబ్బులను ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఖర్చు చేస్తోందని భారత్ ఆరో పిస్తోంది.

2024 జూలైలో ఈ ఒప్పందం ఖరారైంది. ఇక జీటుP7 దేశాల ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌లో పాక్ 2018 అక్టోబర్ వరకు గ్రే లిస్టులోనే ఉంది. ఈ గ్రే లిస్టులో ఉన్న దేశాలకు విదేశీ పెట్టుబడులు రావడం, ఐఎంఎఫ్ నుంచి రుణాలు కష్టతరం అవుతుంది. 

తీరు మార్చుకోని పాక్.. మళ్లీ కాల్పులు

సరిహద్దుల వద్ద పాకిస్థాన్ కాల్పులకు తెగబడుతూనే ఉంది. వరుసగా ఎనిమిదో రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందాని కి తూట్లు పొడుస్తూ తుపాకులకు పని చెప్పింది. ఒక్క చోట అని కాకుండా ఎల్‌వోసీ వెంబడి అనేక ప్రాంతాల్లో పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. ‘గురువారం రాత్రి పాక్ దళాలు కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషేరా, అక్నూర్ ప్రాంతాల్లో ఎల్‌వోసీ వెంట కాల్పులకు తెగబడ్డాయి. భారత భద్రతాబలగాలు సమర్థవంతంగా కాల్పులను తిప్పికొట్టాయి.’ అని ఆర్మీ తెలిపింది. 

వాఘా సరిహద్దును తిరిగి తెరిచిన పాక్

పాకిస్థాన్ శుక్రవారం వాఘా సరిహద్దును మళ్లీ తెరిచింది. భారత్‌లో ఉన్న తమ దేశస్తులు తిరిగి పాక్‌కు వచ్చేందుకు వీలుగా పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై విదేశీ వ్యవహారాల ప్రతినిధి మా ట్లాడారు. ‘పాక్ పౌరులు భారత్‌లో చిక్కుకుపోయారని మేము అనేక మీడియా రిపోర్టు లు చూశాం. భారత అధికారులు వారిని సరిహద్దు దాటేందుకు అనుమతిస్తే మేము కూడా వారు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. చికిత్స కోసం భారత్‌కు వెళ్లిన వారు అర్ధాంతరంగా తిరిగి రావాల్సి వస్తోంది.’ అని పేర్కొన్నారు. 

టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయి: పాక్ మాజీ మంత్రి

పాకిస్థాన్‌కు టెర్రరిస్టులతో సం బంధాలు ఉన్న మాట వాస్తవమే అని ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి, పాక్ పీపుల్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో స్పష్టం చేశారు. ఇటీవల పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. భుట్టో మాట్లాడుతూ.. ‘రక్షణ మంత్రి చెప్పిన ప్రకారం పాకిస్థాన్‌కు గతం ఉందన్న విషయంలో ఎటువంటి దా పరికాలు లేవు. పాక్ ఈ సంబంధాల తో అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. మేము ఈ ఇబ్బందుల నుం చి పాఠాలు నేర్చుకున్నాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు మేము అం తర్గతంగా సంస్కరణలు కూడా తీసుకొచ్చాం. పాకిస్థాన్ తీవ్రవాద చరిత్ర అనేది ముగిసిపోయిన అధ్యాయం.’ అని బిలావల్ భుట్టో పేర్కొన్నారు.