01-08-2025 12:57:55 AM
కాగజ్‌నగర్, జూలై 31 (విజయక్రాంతి): పట్టణంలోని సాయిచరణ్ మోక్ష ధాంలో ఆరు సోలార్ లైట్లను అమర్చేందుకు ఎస్పీ ఎం యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గురువారం మోక్షధాంను ఎస్పీఎం సివిల్, ఎలెక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు సందర్శించి సోలార్ లైట్ల ఏర్పాటుకు పాయింట్ లను గుర్తించారు. మొత్తం ఆరు సోలార్ లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇటీవల మోక్షధాంకు నీటి సరఫరాను కూడా ఎస్పీఎం యాజమాన్యం ఏర్పాటు చేయడంతో మోక్షధాంకు వచ్చే వారికి నీటి సమస్య తీరింది. కాగా సోలార్ లైట్ల ఏర్పా టుతో రాత్రి వేళలో మోక్షధాంకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగవని మోక్షధాం సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎస్పీఎం యాజమాన్యానికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోక్షధాం సభ్యులు ఎస్ వేంకటేశ్ గౌడ్, బంకట్ అసా వా, రవి, దాసరి లక్ష్మన్, దయానంద్, ఎస్పీఎం అధికారులు తుమ్మ రమేష్, ఇమాన్యువల్, రేవతి తదితరులు పాల్గొన్నారు.