calender_icon.png 26 July, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనిల్ అంబానీ ఆఫీసుల్లో ఈడీ దాడులు

25-07-2025 12:00:00 AM

న్యూఢిల్లీ, జూలై 24: ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం దాడులు నిర్వహించింది. ఢిల్లీ, ముంబైలో ని ఆయన గ్రూపు సంస్థలకు చెం ది న మొత్తం 40 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేప ట్టారు. రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన రాగా కంపెనీల ఆర్థిక లావాదేవీలపై యెస్ బ్యాంకు కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

2017, 2 019 మధ్య కాలంలో ఆ బ్యాంకు ను ంచి రుణాలుగా పొందిన రూ.3 వేల కోట్లను మనీలాండరింగ్ పాల్పడిన ట్టు సీబీఐ కేసు నమోదు చేసిం ది. ప్రమోటర్లు, ప్రజల సొమ్మును ప క్కదారి పట్టించేందుకు పక్కా ప్రణాళిక ప్రకారమే బ్యాంకు ఉద్యోగులకు లంచం ఇచ్చినట్టు ఈడీ ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం.