10-07-2025 01:20:01 AM
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. తమిళంలోనూ ఛాన్స్‌లు అందుకుంది. కానీ ఈ అమ్మడికి అంతగా అవకాశాలు రావడం లేదు. ఇటీవలే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్ పైనే ఈ చిన్నది ఫోకస్ పెడుతుంది. కానీ ఈ అమ్మడు అవకాశం వస్తే ఏ భాషలోనైనా నటించి మెప్పిస్తానం టోంది రాశీ ఖన్నా.
అందుకే కాబోలు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీలకు గట్టిపోటీ ఇచ్చేలా రాశీ ఖన్నా కూడా గ్లామర్ గేట్లు ఎత్తేసింది. ఈ మధ్య కాలంలో రాశీఖన్నా పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూస్తే ఏ రేంజ్‌లో అందాలతో అదరగొడుతుందో తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజగా రాశీ ఖన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాశీ ఖన్నా మాట్లాడుతూ.. “నాకు కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టం.
కమర్షియల్ సినిమాలంటే వెంటనే ఓకే చెప్పేస్తా.. కానీ అలాంటి చిత్రాలు చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. అలాంటి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. నేను నటిగా ఎదగాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నా. మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో అవకాశం వస్తే ఆ సినిమానే మన ఎదుగుదలకు కారణం అవుతుంది.
నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి మరో అవకాశం దక్కుతుంది. అలాంటి సినిమాలు ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నా. చాలా కాలంగా సౌత్‌లో సినిమాలు చేస్తున్నా.. కానీ అలాంటి చిత్రాలే హిందీలో చేస్తే ఎలాంటి ఎగ్జయిట్‌మెంట్ ఉండదు” అని చెప్పింది.