02-07-2025 05:09:02 PM
హైదరాబాద్: హెచ్‌ఎండిఎ(Hyderabad Metropolitan Development Authority) మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ నివాసంలో బుధవారం ఈడీ (Enforcement Directorate) అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల (Disproportionate Assets) కేసులో అరెస్టు అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గతంలో సస్పెండ్ అయిన శివబాలకృష్ణ, సోదరుడు నవీన్ కుమార్ నివాసంలోనూ ఈడీ సోదాలు చేసి పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ నియంత్రణ అథారిటీ (TS RERA) మాజీ కార్యదర్శి బాలకృష్ణను మార్చి 2024లో రూ.100 కోట్ల విలువైన అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులో అరెస్టు చేసిన అవినీతి నిరోధక బ్యూరో (ACB) రూ.250 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. అతన్ని అరెస్టు చేసిన తర్వాత దర్యాప్తు సంస్థ హైదరాబాద్, దాని పరిసరాల్లోని వివిధ ప్రదేశాలలో ఉన్న ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య సముదాయాలు, నివాస, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఏసీబీ ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసింది.