02-07-2025 04:40:05 PM
అమరావతి: ఈ ఏడాదే కుప్పం ప్రాంతానికి నీళ్లు రాబోతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు పేర్కొన్నారు. స్వర్ణ కుప్పంలో భాగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఆదర్శ నియోజక వర్గంగా కుప్పంను తీర్చిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు. గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఏడాది కాలంలో సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నామని, కుప్పంలో రూ.1617 కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. హంద్రీనీవా ద్వారా శ్రీశైలం నుంచి కుప్పం ప్రాంతానికి సాగు నీళ్లు వస్తాయని, నియోజకవర్గ ప్రజలు సోలార్ విద్యుత్ వైపు మళ్లాలని సూచించారు.