1 July, 2026 | 9:50 AM

విద్యాశాఖ ప్రక్షాళన జరగాల్సిందే!

16-05-2024 12:05 AM

తెలంగాణలో ఏర్పడిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి అయిదు నెలలు దాటినా విద్యాశాఖకు మంత్రిని నియమించుకోలేక పోయారంటే ఏమనుకోవాలి? ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల వ్యవహారం ఎప్పుడు కొలిక్కి వస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడటం విచారకరం. మిగిలిన అన్ని శాఖల ప్రభుత్వోద్యోగుల మాదిరిగా టీచర్ల ఉద్యోగాలలోనూ ప్రోత్సాహకర విధానాలను ప్రవేశపెట్టాలి.

 - అరుణకుమారి, బోధన్