1 July, 2026 | 8:55 AM

మానవతావాదులు స్పందించాలి

16-05-2024 12:05 AM

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైంది. మానవతావాదులు తక్షణం స్పందించాలి. ఆందోళనలో ముగ్గురు పౌరులు కూడా చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. ‘విజయక్రాంతి’ ఎడిట్ పేజీలోని ప్రధాన వ్యాసం అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టింది. తమ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయాలంటూ స్థానికులు పట్టుబడుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. పాక్ ప్రభుత్వం సమస్య మరింత జటిలం కాకముందు వెంటనే స్పందించాలి.

 - శ్రీవాత్సవ్, హైదరాబాద్