1 March, 2026 | 1:54 AM

ఆర్విన్ ట్రీ పాఠశాలలో ఘనంగా ఎడ్వైట్ 2026

01-03-2026 12:00 AM

కరీంనగర్, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): కరీంనగర్‌లోని ఆర్విన్ ట్రీ పాఠశాలలో ఎడ్వై ట్ 2026 ఆర్విన్ ట్రీ 2.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మినీ వార్షికోత్సవం, తల్లిదండ్రుల అవగాహన సమావేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా హాజరై విజయవంతం చేశారు. కార్యక్రమాన్ని ఆర్విన్ ట్రీ పాఠశాల చైర్మన్ బి. రమణారావు, కరస్పాండెంట్ బి. విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

అనంతరం చైర్మన్ తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. పిల్లల భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులు ఏమి ఆశించాలి, ఏమి ఆశించకూ డదు అనే విషయాలను స్పష్టంగా వివరించారు. పిల్లల్లో లాజికల్ థింకింగ్, విశ్లేషణా త్మక ఆలోచన, క్రమశిక్షణ, విలువల ఆధారిత విద్య వంటి అంశాల ప్రాముఖ్యతను ఎంతో సరళంగా వివరించారు. తరువాత అకాడమిక్ డైరెక్టర్ సి. ప్రతాప్ రెడ్డి తల్లిదండ్రుల అవగాహన కార్యక్రమం ముఖ్య ఉద్దే శ్యాన్ని వివరించారు. కార్యక్రమంలో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అ లరించాయి. చిన్నారుల నృత్యాలు, పాటలు, నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.