14-01-2026 02:47:51 AM
భీమదేవరపల్లి, జనవరి 13 (విజయక్రాంతి):ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండకు విచ్చే సిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఆల య ఈవో కిషన్‌రావు, చైర్మన్ బొజ్జపురి అశోక్, డైరెక్టర్లు, ఆలయ అర్చకులు, స్థానిక బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.
ఈ సంద్భంగా బండి సంజయ్ వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు.కాగా ఆలయంలో లక్ష బిల్వార్చన వేడుకలు అర్చకులు వినయ్ శర్మ రాంబాబు రాజయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్తకొండ వీరభద్రస్వామి స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా రావడం ఆనవాయితీగా ఉందన్నారు.
ఈ జిల్లా, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండా లని వీరభద్రుని కోరుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ మోదీకి అండగా నిలవాలని కోరుకుంటున్నామన్నారు.ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీరామోజు శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య,జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపల్లి పృథ్వీరాజ్,మండల సర్పంచ్ లు మాచర్ల కుమారస్వామి, సిద్ధమల్ల రమా రమేష్, బోయిని మహేష్, కొత్తకొండ దేవాలయ డైరెక్టర్లు దేవరాజు శంకర్,పొన్నాల మురళి, ఒద్దుల సంపత్, కొత్త కొండ వెంకటేశ్వర్లు, బొల్లంపల్లి ప్రకాష్, మార్పు సంజీవరెడ్డి, వల్లెపు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.