14-01-2026 02:46:58 AM
అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో చేరిన యాదాద్రి మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బీకు నాయక్
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బీకు నాయక్, అతని ప్రధాన అనుచరుడు మాలోతు మంగయ్య బీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి మంగళవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో ఆ పార్టీలో చేరా రు. ఈ సందర్భంగా బీకు నాయక్ మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు పార్టీ కోసం నిస్వార్ధంగా కష్టపడితే పార్టీలో ఉన్న రెడ్లు, మరీ ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి తనను అణగదొక్కాలని చూశారని, గిరిజన బిడ్డనైన తనను అడుగడుగునా అవమానిస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మగౌరవం చంపుకో వడం ఇష్టంలేకనే ఆ పార్టీకి రాజీనామా చేసి తమ కోసం, తమ ఆత్మగౌరవం కాపాడటం కోసం పుట్టిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరానని చెప్పారు. రెడ్డి, వెలమల ఆధీనంలో ఉన్న పార్టీలలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగదని, ఆ పార్టీల నుంచి అందరు బయటకొచ్చి మన కోసం ఏర్పడ్డ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్‌రాజ్, రాష్ట్ర నాయకులు కొమ్రిశెట్టి నర్సింహులు, రంగన్న పాల్గొన్నారు.
విద్యార్థి సేనలో చేరికలు
తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నాయకులు మంగళవారం తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన (టీఆర్‌వీ ఎస్)లో చేరారు. పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విద్యా ర్థులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన విద్యార్థి నాయకులకు మల్లన్న ప్రత్యేకంగా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు దశాబ్దాలుగా జరుగుతున్న రాజకీయ, సామాజిక అన్యాయాన్ని వివరించారు.
ఇన్నేళ్లుగా విదార్థులను కేవలం ఓటు బ్యాంకుగానే ఈ పార్టీలు వాడుకున్నాయి తప్ప విద్యార్థుల భవిష్యత్తు కోసం కాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అగ్రవర్ణ రాజకీయ పార్టీల జెండాలు మోసింది ఇక చాలని ఇప్పుడు మన జెండా మనమే ఎత్తి మన వాటా మనం సాధించుకోవాలి” అని మల్లన్న పిలుపునిచ్చారు. రెడ్డి, వెలమ సామాజిక వర్గానికి పెద్ద పెద్ద కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నా యి కానీ మెజారిటీ జనాభా ఉన్న బీసీలకు ఎందుకు లేవు అనే విషయాలను మల్లన్న గారు విద్యార్థులకు వివరించారు.
ఈ వ్యత్యా సం వెనుక ఉన్న రాజకీయ కుట్రలను విద్యార్థులు గమనించాలి” అని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే విద్యార్థులు వెన్నెముకగా నిలిచారో, ఇప్పుడు రాజ్యాధికార సాధనలో కూడా అదే స్ఫూర్తి తో ముందుకు రావాలని ఆయన కోరారు. విద్యార్థి శక్తిని మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే అన్ని యూనివర్సిటీల్లో “తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన” కమిటీలను ఏర్పాటు చేస్తామని మల్ల న్న ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, యూత్ విభాగం అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్ర శేఖర్, ఏబీవీపీ ఓల్డ్ సిటీ సెక్రటరీ యశ్వంత్, ఎన్‌ఎస్‌యూఐ నేత సంజయ్ పాల్గొన్నారు.