calender_icon.png 19 November, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు కృషి

16-08-2024 12:50:10 AM

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హనుమకొండ, ఆగస్టు 15 (విజయక్రాంతి): వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పా టుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. గురువారం వరంగల్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. అనంతరం మంత్రి స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు.