18 April, 2026 | 10:05 AM

మా సమస్యలను పరిష్కరించండి

01-06-2025 12:11 AM

ఎన్‌ఎంసీ చైర్మన్‌కు జూడాల ఫిర్యాదు

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు (జూ డాలు), పీజీ విద్యార్థులకు న్యాయబద్ధంగా అందాల్సిన స్టుఫైండ్, గౌరవ వేతనాలు సకాలంలో అందడం లేదని, తమ సమస్యల న్నింటికీ పరిష్కారం చూపాలని టీ జూడా అసోసియేషన్ ఆధ్వర్యంలో జూడాలు శనివారం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎం సీ) చైర్మన్ డాక్టర్ బీఎన్ గంగాధర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పనిఒత్తిడి కారణంగా పీజీ  విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, వారి మానసిక ఆరోగ్యంపై పనిభారం ప్రభావం చూపిస్తున్నదని వాపోయారు.