13 March, 2026 | 6:30 PM

గ్రామాల స్వయం సమృద్ధికి కృషి చేయాలి

13-03-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా 

కరీంనగర్, మార్చి 12 (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని.. విధులు బాధ్యతలు సక్రమంగా ని ర్వర్తించి గ్రామాల స్వయం సమృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. గురువారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని సర్పంచులకు ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు హా జరై.. 99 రోజుల కార్యాచరణలో చేపట్టాల్సిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు వచ్చే నిధులు,  ఆదాయ- వ్యయాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక నిర్వహణ తదితర అం శాలపై సర్పంచులకు పూర్తి అవగాహన ఉం డాలన్నారు. 

ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచేలా నాణ్యమైన విద్య వైద్యం అందించడంతోపాటు పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పన్నుల వసూలుతో పాటు సొంతంగా ఆదాయం పెంచు కోవాలని సర్పంచులకు సూచించారు. ఆదా యం పెంపుపై దృష్టి పెట్టి గ్రామాల అభివృద్ధికి నిరంతరం పాటుపడాలని పేర్కొన్నారు.

గ్రామపంచాయతీ సమావేశాలు గ్రామసభలు నిర్వహిస్తూ.. నిత్యం వార్డులను పర్యవే క్షిస్తూ సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించాలని సూచించారు. గ్రామ సర్పంచులు అన్నీ తామై వ్యవహరిస్తూ ప్రజలకు భరోసా నింపాలన్నారు.  ఈ కార్య క్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్, డిపిఓ జగదీశ్వర్, డిఎంహెచ్‌ఓ వెంకటరమణ, డిఆర్డిఓ శ్రీధర్, డీఏవో భాగ్యలక్ష్మి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కార్పొరేటర్లు, కౌన్సిలర్ల శిక్షణ 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక‘ 90 రోజుల కార్యాచరణలో భాగంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా యంత్రాం గం ఆధ్వర్యంలో పలు అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ నగరం పట్టణాల అభివృద్ధిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాత్ర కీలకమని, అందరం కలిసికట్టుగా జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుదామని అన్నారు.

కార్పొరేటర్లు, వార్డు సభ్యులు ఎంత బాధ్యతగా ఉంటే ఆ పట్టణాలు అంతలా అభివృద్ధి చెందుతాయని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాలుపంచుకుంటూ అంతిమంగా ప్రజా సేవే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో రమేష్, హుజురాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, వైస్ చైర్పర్సన్ గూడూరి అంజలి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ మహమ్మద్, చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరిత, వైస్ చైర్పర్సన్ పెరుమాండ్ల మానస, మున్సిపల్ కమిషనర్లు సయ్యద్ ముసాబ్ అహ్మద్, మనోహర్, మహమ్మద్ ఆయాజ్, తదితరులు పాల్గొన్నారు.