calender_icon.png 5 August, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి భద్రతల రక్షణకు కృషి చేయాలి

01-08-2025 12:51:31 AM

ఎస్పీ కాంతిలాల్ పాటిల్

కాగజ్‌నగర్, జూలై 31 (విజయక్రాంతి): శాంతిభద్రతల రక్షణకు కృషి చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. గురువా రం కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ను సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. స్టేషన్‌లోని రికార్డులు, ఫిర్యాదు విభా గం, , చార్జ్ షీట్లు, కేస్ డైరీలు,  ఇతర అధికారపత్రాలను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి ఎస్‌హెచ్‌ఓ నుంచి వివరాలు తీసుకుని త్వరితగతిన పరిష్కరించా ల్సిందిగా ఆదేశించారు.

స్టేషన్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై వారి విధి నిర్వహ ణ, ప్రజలపై దృష్టి, నైతిక బాధ్యతలపై మార్గనిర్దేశనం చేశారు. బ్లూ కోల్ట్ డ్యూటీలో ఉన్న ప్పుడు డయాల్ 100 కాల్స్‌కి తక్షణమే స్పం దిస్తూ వెంటనే సంఘటన స్థలానికి చేరుకునేలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల కు మెరుగైన సేవలు అందించేందుకు నిష్టతో పని చేయాలని, పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంచే విధంగా ప్రజలతో వ్యవహరిం చాలని సూచించారు. ఈ కార్యక్రమం లో  డీఎస్పీ రామానుజం, రూరల్ సీఐ కుమార స్వామి,  ఎస్.ఐ సందీప్  పాల్గొన్నారు.