01-08-2025 12:50:36 AM
రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క
ములుగు,జూలై31(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క వైద్యాధికాలకు సూచించారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి సీజనల్ వ్యాధుల పై వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అనే నినాదానికి బద్ధులై పనిచేయాలని, వైద్యుడుగా కనిపించే దేవుళ్ళని వైద్య శాఖకు తెలుపుతూ, వర్షాకాలంలో వచ్చే మలేరియా డెంగ్యూ అతి సార టైఫాడ్లపై చికిత్సతో పాటు గ్రామాలలో గ్రామ పెద్దలు యువకుల సమూహంతో అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని తెలిపారు.
వైద్య సిబ్బంది సమయాన్ని పాటించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ములుగు వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలను అందించాలని జనరల్ హాస్పిటల్ ములుగు అధికారులను సూచించారు.