10-07-2025 10:18:57 PM
యువగళం సైకిల్ యాత్ర కరపత్రాలు ఆవిష్కరణ..
తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సిహుంలు..
హుజూర్ నగర్/గరిడేపల్లి: తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు పిలుపునిచ్చారు. గురువారం హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్ ఆధ్వర్యంలో ఈ నెల 17న గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం గ్రామంలో ప్రారంభమయ్యే యువగళం సైకిల్ యాత్ర కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత వచ్చిన పాలకులు అధికారాన్ని అనుభవించి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.
తెలంగాణలోని ప్రజలు మార్పు కోరుకోవాలని మళ్లీ పేద వర్గాలకు స్వేచ్ఛ స్వతంత్రాలు, విద్య, వైద్యం, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి సాధించాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. గ్రామ స్థాయి, మండల, నియోజకవర్గ, పార్లమెంటు, రాష్ట్రస్థాయిలో కమిటీలు నిర్మిస్తూ తెలుగుదేశం పార్టీ పునర్వవైభవం సాధించే విధంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. హుజూర్ నగర్ లో నిర్వహించే సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు అమరవరపు శ్రీమన్నారాయణ, అంజయ్య, శ్రీనివాస్, యాదయ్య, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.