calender_icon.png 3 August, 2025 | 11:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

25-07-2025 02:09:47 AM

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల అర్బన్, జూలై 24 (విజయ క్రాంతి): జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ లో మౌలిక సదుపాయాల కడపనకు కృషి చేస్తున్నామని త్వరలోనే 20000 మంది నివసించే విధంగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేం ద్రంలోనీ అర్ డి వో కార్యాలయం లో అర్బన్ హౌసింగ్ ఇందిరమ్మ కాలనీ మౌలిక సదుపాయాల కల్పన పై ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎ మ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ 20వేల మంది నివాస సదుపాయం కోసమే అర్బన్ హౌసింగ్ ఇందిరమ్మ కాలనీ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసినట్టు తెలిపారు.కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడ్డ తర్వాత మౌలిక వసతుల కల్పన కోసం రు.34 కోట్లను మంజూరు చేయగా నీళ్లు, నీళ్ల ట్యాంకులు, డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంకులు, కరెంటు,స్తంభాలు, మెయిన్ రోడ్డు లు తదితర వసతులు కల్పించామని తెలిపారు.

4520 ఇండ్ల కోసం అక్కడ నివసించే ప్రజలకు అత్యవసర మౌలిక సదుపాయాల కల్పనకు నిత్యం కృషి చేస్తున్నామన్నారు.విలీన ప్రాంతాలకు,అర్బన్ హౌసింగ్ ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రు.20 కోట్లు ఇటీవల మంజూరు చేయడం జరిగిందని,రు.20 కోట్ల నిధులతో మౌలిక సదుపాయాలైనహాస్పిటల్, స్కూల్స్, కమ్యూనిటీ హాల్, పోలీస్ స్టేషన్ ,బస్టాండ్, అంగన్వాడి కేంద్రం, అర్బన్ హెల్త్ సెంటర్, పార్కులు, ఓపెన్ జిమ్ ,ఇలా అనేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రాథమిక సదుపాయాల కల్పనకు ప్రజలకు అనువుగా ఉండే స్థలాన్ని అధికారులు గుర్తించాలన్నారు. సి డి ఎం ఏ ద్వారా అనుమతి రాగానే త్వరలోనేటెండర్లు కూడా పిలవడం జరుగుతుందని,అధికారులు ఆదిశగా పనులు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో అర్ డి వో మధుసుధన్,పీడీ హౌసింగ్ ప్రసాద్,కమిషనర్ స్పందన,ఎమ్మెర్వో రామ్మోహన్, డి ఐ సర్వే విఠల్, డి ఈ మిలింద్, ఏఈ లు అనిల్, శరన్,ఎస్.కె కన్సల్టెన్సీ రంగారెడ్డి,రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.