calender_icon.png 4 August, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్రాష్ర్ట బైక్ దొంగల అరెస్టు

25-07-2025 02:09:47 AM

రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైకులు స్వాధీనం 

ఎల్బీనగర్, జూలై 24: ఎల్బీనగర్ పోలీసులు గురువారం అంతరాష్ర్ట బైక్ దొంగల ముఠాను పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, 9 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్లు, 1 యునికార్న్,1 పల్సర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.  వీటి విలువ రూ. 18 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం గుడివాడ గ్రామానికి చెందిన షేక్ అక్రమ్ (36) హైదరాబాద్ బోడ్డుప్పల్‌లో ఉంటూ ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

ఏపీ లోని కోనసీమ అంబేద్కర్ జిల్లా అల్లవరం మండలం కొమరగిరి పట్నం గ్రామానికి చెందిన ఈడిగ దుర్గా గంగాధర్  (31) తాపీ పని చేస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రావరం మండలం వెలివెన్ను గ్రామానికి చెందిన నీరుకొండ చరణ్ (24) అడ్డగుట్ట సొసైటీలో ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ ముగ్గురు కలసి బైక్ చోరీలకు పాల్పడుతున్నారు. బుధవారం ఎల్బీనగర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. విచారించగా నేర చరిత్ర బయటపడింది.