25-07-2025 02:11:01 AM
కరీంనగర్, జూలై 24 (విజయ క్రాంతి): మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను నగర బిఆర్‌ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో గురువా రం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు హాజరై బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం పాదాచారులకు, వాహనదారులకు మిఠాయిలు, పండ్ల, పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, చల్ల హరిశంకర్ లు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ముందించిన ఘనత కేటీఆర్ దని అన్నారు. కేటీఆర్ నిత్య చైతన్యంతో ప్రజాసేవలో ఉండాలని మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించి తెలం గాణ ప్రజలకు సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.