24-10-2025 12:29:21 AM
భూ పరిహార రైతులకు చెక్కుల ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి
మాడుగుల, అక్టోబర్ 23: రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కెఎల్ ఐ ( కల్వకుర్తి ఎత్తిపోతల ), పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా కల్వకుర్తి నియోజక వర్గం లో ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీనిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారం తో కల్వకుర్తి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి గతంలో ముందుకు తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు.
గురువారం కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండల కేంద్రంలో రైతు వేదికలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో భూములు కోల్పోయిన బాధిత 87 మంది రైతులకు రూ. 2. 33 కోట్ల పరిహారం తో పాటు మండలంలోని 63 మంది మహిళలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రానికి మన ప్రాంత బిడ్డ సీఎం కావడం మన అదృష్టమని చెప్పారు.
అడిగిన వెంటనే ప్రాంత అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్నాడని ఆయన గుర్తు చేశారు. కల్వకుర్తి నియోజకవర్గం శాశ్వతంగా కరువును పారదోలెందుకు పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, దాదాపు పూర్తి కావస్తుందన్నారు. కెల్‌ఐ- డి 82 ద్వారా కల్వకుర్తి నియోజకవర్గం లోని దాదాపుగా అన్ని గ్రామాలకు సాగునీరు పారి రైతన్నల పొలాల్లో సిరులు పండుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మాడుగుల మండలం లో పలు సమస్యలు పరిష్కరించాలని సీఎం మామలు సూదిని పద్మా రెడ్డి, మాజీ ఎంపీపీ క సూదిని రామ్ రెడ్డిలు పరితపిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. వారి ప్రాంతంపై చూపుతున్న చొరవ అభినందనీయమని ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. కార్యక్రమంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఈ ఈ శ్రీకాంత్, డి ఈ ఈ దేవన్న, తహసిల్దార్ వినయ్ సాగర్,
డిప్యూటీ తాసిల్దార్ రాజశేఖర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కిషన్ రెడ్డి, మాడుగుల విజయ డైరీ చైర్మన్ బొజ్జ సాయి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాచారం వెంకటేశ్వర్లు గౌడ్, సూదిని కొండల్ రెడ్డి, కొత్త పాండు గౌడ్, సూదిని శ్రీనివాస్ రెడ్డి, కాట్ల యాదయ్య గౌడ్, అందుగుల జయలక్ష్మి రాజ్,సామల్ల నిరంజన్ గౌడ్, డైరెక్టర్ బొజ్జ జగ్పాల్ రెడ్డి, కొప్పుల జగన్ గౌడ్, ఎ ఏం సి డైరెక్టర్లు పల్లె జంగయ్య గౌడ్, ఉడుతల యాదయ్య గౌడ్, జల్ల రమేష్ గౌడ్, సంపతుకుమార్ లు పాల్గొన్నారు.