24-10-2025 01:07:22 AM
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక చిన్న యుద్ధం లాంటిదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి సెక్యులర్ లీడర్ దేశంలో ఎవరూ లేరని తెలిపారు. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భు తంగా అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్ యూత్ కరేజ్ (హెచ్‌వైసీ) వ్యవస్థా పకుడు, సామాజిక కార్యకర్త సల్మాన్‌ఖాన్ గురువారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భం గా కేటీఆర్ మాట్లాడుతూ.. ముస్లింలు, ఇతర వర్గాల పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, ముస్లిం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, క్యాబినెట్‌లో మంత్రి లేరని ప్రశ్నించారు. షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని ఎందుకు చేయలేదని నిలదీశారు. మహిళలకు ఫ్రీ బస్సు అంటూ బస్సు చార్జీలు పెంచారని విమర్శించారు. కాంగ్రెస్ ముస్లింలను మో సం చేసిందని ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ముస్లింలు మోసపోలేదా అని ప్రశ్నించారు. బీహార్‌లో ముస్లింలు మోసపోయారని రాహుల్‌గాంధీ అంటున్నారని, మరి తెలంగాణ పరిస్థితి ఏం టని నిలదీశారు. 42 శాతం రిజర్వేషన్ల పేరు తో బీసీలను కూడా రేవంత్ మోసం చేశారని ఆరోపించారు. రాష్ర్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘బుల్డోజర్ రాజ్యం’ నడుస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
‘రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ బేకార్ అంటారు, కానీ రేవంత్‌రెడ్డి గుజరాత్ మోడల్‌ను ఫాలో అవుతున్నారు’ అని విమర్శిం చారు. ‘హైడ్రా’ పేరుతో రేవంత్‌రెడ్డి బుల్డోజర్లు పంపుతున్నారని ఆరోపించారు. ‘ఇక్కడ కారు.. అక్కడ బేకార్ రేవంత్‌రెడ్డి ఉన్నారు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక రియల్‌ఎస్టేట్ కుప్పకూ లిందని ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహి ల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటుతో ము స్లింలు సమాధానం చెప్పాలని, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ముస్లింలకు కాంగ్రెస్‌ధోఖా: సల్మాన్ ఖాన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తన నామినేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుందని సల్మాన్ ఖాన్ ఆరోపించారు. తనను పోటీకి దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేశారని, నిన్నటి నుంచి తనను కొనేందుకు పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు విశ్వ ప్రయత్నం చేశారని, ఏమి కావాలంటే అది చేసి పెడతామని ఆశ చూపారని వెల్లడించారు. తాను అమ్ము డు పోయేవాడిని కాదని కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేసి కేటీఆర్‌ను కలిశానని తెలిపారు.
తెలంగాణ కోసం పోరాడిన యోధుల పార్టీలోనే చేరాలని తన అభిమానులు సూచిం చారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు స్మశాన వాటిక కూడా కేటాయిం చలేదు, ఇక ఏమిస్తుందని ప్రశ్నించారు. ముస్లింల ఓట్లు దండుకుని వారిని ధోఖా చేసిన పార్టీ కాంగ్రెస్ అని, ముస్లిం నాయకులను కుట్రపూరితంగా ఎదగనివ్వడం లేదని ఆరోపించారు. సెక్యులర్ విలువలను రేవంత్ రెడ్డి మంట గలుపుతున్నారని, గంగా జము నా తెహజీబ్ ను కాపాడిన నాయకులు కేసీఆర్, కేటీఆర్ అని కొనియాడారు.
కష్టకా లంలో బీఆర్‌ఎస్ నన్ను అక్కున చేర్చుకుందని, కేటీఆర్ నాయకత్వంలో పని చేసే అవ కాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో కేసీఆర్, కేటీఆర్‌లను బాధ పెట్టే విధంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పారు. జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమైపోయిందని, వచ్చే ఎన్నికల్లో అధికారం లోకి వచ్చేది బీఆర్‌ఎస్సే అని, తెలంగాణలో గులాబీ జెండా ఎగిరేలా హెచ్‌వైసీ కృషి చేస్తుందన్నారు.