15-11-2025 10:05:21 PM
యూనివర్సిటీ విద్యాల సమస్య పరిష్కారానికి కృషి..
చట్టసభల్లో విద్యావంతుల సంఖ్య తక్కువే..
ఎమ్మెల్సీ మల్లన్న..
నల్గొండ రూరల్: విద్య వైద్యానికి బడ్జెట్లో 40 శాతం నిధులు కేటాయిస్తూనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీని సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాడితో కలిసి భోజనం చేశారు మాత్మ గాంధీ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఎలాంటి సమస్య ఉన్న వట్టే జానయ్య కు ఫోన్ చేయాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు వేదికగా ఒక విజ్ఞానవంతమైన కొత్త తరం బయటికి వస్తుంది అన్నారు. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. 10 పాస్ అయిన వాళ్లే చట్టసభల్లో ఉండడం బాధాకరమన్నారు.
ఉన్నత విద్యావంతులైన యువత చట్ట సభలో అడుగు పెట్టాలన్నారు. దేశ యూనివర్సిటీ గుర్తింపులో మాత్మ గాంధీ యూనివర్సిటీ 557వ ర్యాంకు ఉండడం ఆందోళన కలిగిస్తుంది అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తును ఎంచుకోవాలని యూనివర్సిటీకి మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు వి సి అల్తాఫ్ హుస్సేన్ రిజిస్టర్ ఆల్వాల్ రవీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్, వట్టే జానయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.