15-11-2025 10:03:07 PM
నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): మండలంలోని మాసానిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలులో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు, రైతులు తెలిపారు. రైతులకు తీవ్ర ఇబ్బందులు కలగజేయడమే కాకుండా ఇష్టానుసారంగా ఐకెపి సీసీ సావిత్రి మాట్లాడుతున్నారని తెలిపారు.వరి ధాన్యం కాంట చేసి ఐదు రోజులు అయితున్నప్పటికీ లారీలు తెప్పించడంలేదని వరి ధాన్యం కొనుగోలు కేంద్రము ఇన్చార్జి సిసి సావిత్రినీ అడుగుతే ఐదు రోజులు అవుతుంది. పది రోజులవుతాదని తిక్క,తిక్క సమాధానాలు చెప్తున్నారని గ్రామస్తులు, రైతులు తెలిపారు. లారీలు రానప్పుడు వరి ధాన్యాన్ని ఐదు రోజుల ముందు కాంటా చేయడం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు.
కాంట చేసినటువంటి రైతు ధాన్యం సంచుల కోసం రాత్రిపూట నిద్రపోవడం జరుగుతుందని ప్రమాదవశాత్తు రైతులకు ఏమైనా జరుగుతే పూర్తి బాధ్యత ఎవరిదని ఆవేదన వ్యక్తం చేసుకున్నారు.రాత్రి వేళలో క్రిమి కీటకాలు తిరిగే ఆస్కారం ఉందని తెలిపారు.గత ఐదు రోజులుగా కాంత చేసినటువంటి ధాన్యాన్ని లారీలు తెప్పించి తరలించాలని,అలాగే వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతున్నారు.లారీల ఆలస్యంపై నాగిరెడ్డిపేట్ మండల ప్రెస్ సభ్యులకు,ప్రెస్ గ్రూపుల్లో పెడతాను అని గ్రామ యువ రైతు వినోద్ అడుగుతే మీ ఇష్టం ఉన్న గ్రూపులో పెట్టుకోండి అని సిసి.సావిత్రి తెలిపారన్నారు.