calender_icon.png 14 May, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా

13-05-2025 09:08:43 PM

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు..

నిరాహార దీక్ష విరమించిన సిపిఐ నాయకులు..

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం పాకాల ఏటి పై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి తాను ప్రత్యేకంగా కృషి చేస్తానని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి తప్పకుండా చర్యలు తీసుకుంటానని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) ప్రకటించారు. ఏటిపై హై లెవెల్ వంతెన నిర్మించాలని సిపిఐ గార్ల మండల సమితి ఆధ్వర్యంలో మూడు రోజుల పాకాల యేటి వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... గత మూడు రోజులగా నా నిద్రాహారాలు మానేసి సంఘటితంగా నిరాహార దీక్ష చేసినందుకు మీకు విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈ పాకాల ఏటి పై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ భారం నాకు వదిలేయండి, రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి బ్రిడ్జికి నిదులు మంజూరు చేయించి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ నెల 17న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా, గార్ల మండల ముఖ్య నాయకత్వంతో ఉపముఖ్యమంత్రి బట్టీ విక్రమార్కతో భేటి అవ్వనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి తెలియజేశారు.

ఈ మూడు రోజుల పాటు దీక్షలో పాల్గొన్న నాయకత్వం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్, రాగం రమేష్, దార్ల నాగేష్, సింగు రమేష్, దూపాటి జనార్దన్, మాగం లోకేష్, ఇరుగు వెంకటేష్, పొన్నం వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బి.అజయ్ సారథి, పెరుగు కుమార్, చించకుంట్ల వెంకన్న,సాంబ లక్ష్మి,సారిక శ్రీనివాస్, వెలుగు శ్రావణ్, తండా సందీప్, నాదెండ్ల పద్మ, తండా సతీష్, మైమూద్, వీరవెల్లి రవి, కూరం భాగ్య, ఎర్రోజు పద్మ,రాణి, మాలోత్ రవిందర్, గుండా సుధాకర్ రెడ్డి, గుగులోత్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.