calender_icon.png 20 May, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎనిమిది మంది గూఢచారులు అరెస్ట్

20-05-2025 02:36:11 AM

పాక్‌కు గూఢచర్యం చేస్తున్నారని తేల్చిన పోలీసులు

న్యూఢిల్లీ, మే 19: భారత్‌లో ఉంటూ పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఎనిమిది మంది గూఢచారులను సోమ వారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా పాకిస్థాన్ నుంచి డబ్బులు తీసుకుని ఇక్కడి రహస్యసమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటికే పోలీసులు గూఢచర్యం ఆరోపణల మీద పోలీసులు అనేక మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఎనిమిది మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో అంతా అలెర్ట్ అయ్యారు. అరెస్టయిన ఎనిమిది మందిలో నలుగురు హర్యానా వాసులు, ముగ్గురు పంజా బ్ వ్యక్తులు, ఒకరు యూపీకి చెందిన వారున్నారు.