calender_icon.png 20 May, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర లేదు

20-05-2025 02:39:43 AM

  1. భారత్-పాక్ మధ్యే ఒప్పందం కుదిరింది
  2. పార్లమెంటరీ కమిటీకి వివరించిన విదేశాంగశాఖ సెక్రటరీ మిస్రీ

న్యూఢిల్లీ, మే 19: భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికన్ పాత్ర  లేదని విదేశాంగ శాఖ కార్య దర్శి విక్రమ్ మిస్రీ సోమవారం పార్లమెంటరీ కమిటీకి తెలిపారు. శశిథరూర్ అధ్యక్షతన జరిగిన ఈ పార్లమెంటరీ కమిటీ ముందట మిస్రీ హాజరై తన వివరణ ఇచ్చారు. కాల్పుల విరమణకు మ ధ్యవర్తిత్వం వహించానని అమెరికా అ ధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెప్పుకున్నా.. భారత్ ఎందుకు నిశ్శబ్దంగా ఉం ది? అని పార్లమెంటరీ కమిటీలోని ఓ స భ్యుడు ప్రశ్నించారు.

‘కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో పక్షం పాత్ర ఏమీ లేదు. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన విషయంలో మా అనుమతే తీసుకోలే దు. ఈ ఉగ్రదాడులతో సంబంధం ఉన్నవారు పాక్‌లోని కొందరు వ్యక్తులతో సంభాషించారు. తుర్కియే  పాకిస్థాన్‌కు మద్దతు తెలిపింది. తుర్కియే నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్యపరచలేదు. సమీప భవిష్యత్‌లో తుర్కియోతో భారత సం బంధాలు సాధారణ స్థితికి చేరుకుంటాయని మేము అనుకోవడం లేదు. జమ్మూకశ్మీర్‌పై మాట్లాడే అర్హత ఏ ఇతర దేశాలకు లేదు.’ అని మిస్రీ పేర్కొన్నారు. 

పాక్ నుంచి అణ్వాయుధాల చప్పుడు లేదు

పాకిస్థాన్ అణ్వాయుధాలు ప్రయోగించాలని చూస్తోందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కూడా మిస్రీ పార్లమెంటరీ కమి టీకి వివరణ ఇచ్చారు. పాకిస్థాన్ వైపు నుంచి అణ్వాయుధాల చప్పుడు లేదని తెలిపారు. పాకిస్థాన్ చైనాకు చెందిన ఆయుధాలు ఉపయోగించిందా అని ఓ సభ్యుడు ప్రశ్నించగా.. ‘వారు ఏం ప్ర యోగించారన్నది విషయం కాదు. మ నం వారి వైమానిక స్థావరాలను కోలుకోకుండా ధ్వంసం చేశాం.’ అని అన్నా రు.

యుద్ధంలో కోల్పోయిన భారత యుద్ధవిమానాల సంఖ్య గురించి కమిటీ ప్రశ్నించగా.. దేశ భద్రతా కారణాల దృ ష్ఠ్యా మిస్రీ ఆ విషయం బయటపెట్టలేదు. ఈ పార్లమెంటరీ కమిటీకి శశిథ రూర్ నేతృత్వం వహించగా.. తృణమూ ల్ కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్ బెనర్జీ, కాంగ్రెస్ నుంచి రాజీవ్ శుక్లా, దీపిందర్ హుడా, ఏఐఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ నుంచి అపరాజితిత సా రంగి, అరుణ్ గోవిల్ పాల్గొన్నారు.