20-05-2025 02:32:55 AM
ఆపరేషన్ సిందూర్ వివరాలు వెల్లడించిన ఆర్మీ
న్యూఢిల్లీ, మే 19: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్‌కు చెందిన 64 మంది సైనికులు, అధికారులు మరణించినట్టు ఆర్మీ అధికారులు సోమవారం పేర్కొన్నారు. అంతే కాకుండా మరో 90 మంది గాయపడ్డారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైనికులు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.