calender_icon.png 21 August, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నార్సింగిలో ఇంజినీర్ దారుణ హత్య

29-06-2024 03:26:04 PM

నార్సింగి: రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలంలో పట్టపగలే ఇంజినీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంజినీర్ ను నిర్మానుష్య ప్రాంతంలో దుండగులు గొంతుకోసి చంపేశారు. మృతుడిని గోల్కొండకు చెందిన ఇదాయత్ అలీగా గుర్తించారు.  కారులో ఇద్దరు యువకులు, యువతి వచ్చి హత్య చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. క్వాలిస్ వాహనాన్ని హత్య స్థలంలోనే వదిలేసి పారిపోయారు దుండగులు. నార్సింగి గంధంగూడలోని ప్రధాన రహదారిపై ఘటన చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి 20 రోజుల క్రితమే ఇజాయత్ అలీ హైదరాబాద్ కువచ్చాడు. ఘటనాస్థలంలో క్లూస్ టీమ్, పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు క్వాలిస్ వాహనంతో పాటు 2 ఫోన్లు సీజ్ చేశారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.