15-10-2025 07:41:47 PM
చిట్యాల (విజయక్రాంతి): జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ బోరగాల అశోక్ తెలిపిన వివరాల ప్రకారం మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన మోరే సముద్రమ్మ(70) వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మోరే సముద్రమ్మ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం సాయంత్రం పురుగుల మందు సేవించింది. గమనించిన కుటుంబ సభ్యులు మృతురాలిని 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు మోరే రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.