calender_icon.png 6 July, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియుడి కోసం భర్త హత్య!

06-07-2025 12:26:51 AM

బాచుపల్లిలో వెలుగులోకి

కుత్బుల్లాపూర్, జూలై 5: భర్తను భార్య గొంతు నులిమి హత్య చేసిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వె లుగులోకి వచ్చింది. నారాయణపేట్ జిల్లా రామకృష్ణయ్యపల్లికి చెందిన అంజిలప్ప, రాధ దంపతులు.. వీరికి కుమారుడు, కుమా ర్తె ఉన్నారు. ఈ దంపతులు వలస కూలీలుగా పనిచేసేవారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాచుపల్లిలోని కాంట్రాక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో ఓ కంపెనీలో నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు.

అయితే రాధ తరచుగా తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతుండటంతో దంపతుల మధ్య గొడవలు జరుతున్నాయి. జూన్ 22న అంజిలప్ప మద్యం సేవించి ఇంటికి వెళ్లగా.. రాధ ప్రియుడి విషయమై గొడవపడగా.. రాధపై అంజిలప్ప దాడి చేశా డు. రాత్రి భర్త మద్యం మత్తులో పడుకుని ఉండగా.. రాధ అతని ఛాతిపై కూర్చొని, గొం తు నులిమి హత్య చేసింది. హత్యను దాచేందుకు తన భర్త మితిమీరిన మద్యం సేవించ డం వల్ల మరణించినట్లు కుటుంబ సభ్యులను నమ్మించింది.

మృతదేహాన్ని అంత్యక్రి యల కోసం స్వగ్రామానికి తరలించగా.. మృతుడు సోదరుడు గాయాలు గుర్తించి నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి కేసును బా చుపల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ నెల 1న బాచుపల్లి పోలీసులు రాధను అరెస్టు చేసి విచారించగా తన భర్త రోజూ మద్యం సేవించి హింసిస్తున్నాడనే హత్య చేసినట్లు ఒప్పుకుందని పోలీసులు తెలిపారు.