8 April, 2026 | 2:02 PM

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వ్యక్తి కేసీఆర్

07-05-2024 01:31 AM

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి, మే 6 (విజయక్రాంతి): మాట ఇచ్చి నిలబెట్టుకున్న వ్యక్తి కేసీఆర్ అని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి బాన్సువాడ సంగమేశ్వర కాలనీ, నిజాం సాగర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌ల్లో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో పింఛన్ రూ.2 వేలకు పెంచారని, రైతుబంధు డబ్బులు సమయానికి ఖాతాల్లో వేశారని, అలాగే ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. 24 గంటల కరెంటు ఇస్తా అని చెప్పి మాట నిలబెట్టుకున్న వ్యకి కేసీఆర్ అన్నారు. పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే తన ఆశయమని తెలిపారు.  బీఆర్‌ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ జుబేర్, నాయకులు దఫేదర్ రాజు, లింగమేశ్వర్, వెంకట్, సరిత, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.