09-10-2025 12:19:18 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 8 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో అధికారు లు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వేలాది రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందా లు నిరంతరం గస్తీ కాస్తూ, ప్రచార ఆర్భాటాలకు కళ్లెం వేస్తున్నాయి.
బుధవారం నాటికి నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 1,620 రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లును తొలగించారు. వీటిలో ప్రభుత్వ ఆస్తులు, గోడల పై ఏర్పాటు చేసిన 1,097 పోస్టర్లు, వాల్ రైటింగ్‌లతో పాటు, ప్రైవేటు ఆస్తులపై ఎలాంటి అనుమతి లేకుండా పెట్టిన 523 బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉన్నాయని స్పష్టం చేశారు. అనుమతి లేని ప్రచార సామగ్రిని పూర్తిస్థాయిలో తొలగించి, సంబంధిత ప్రాంతాలను శుభ్రం చేశారు.
ఉల్లంఘనలపై చర్యలు: ఎన్నికల అధికారి కర్ణన్
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వా డ్లు, స్టాటిక్ సర్వులైన్స్ బృందాలు 24 గంట లూ అప్రమత్తంగా ఉండి, నగదు, మ ద్యం, ఇతర ప్రలోభాల పంపిణీ జరగకుండా నిశితంగా పరిశీలించాలని సూచిం చారు. ఎన్నిక ల నియమావళి ఉల్లంఘనలపై ప్రజల నుం చి వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు ‘సి-విజిల్’మొబైల్ యాప్, 1950 ఎలక్షన్ హె ల్ప్‌లైన్‌ను నిరంతరం పర్యవేక్షించాలని ఆయ న స్పష్టం చేశారు. వచ్చిన ఫిర్యాదులను నిర్దేశిత సమయంలో పరిష్కరించి, తీసుకున్న చర్యలను నివేదించాలని ఆదేశించారు.