calender_icon.png 7 July, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక జిల్లా కన్వీనర్ల ఎన్నిక

07-07-2025 12:22:02 AM

ముషీరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం  చిక్కడపల్లిలోని టి యు జెఎసి రాష్ట్ర కార్యాలయంలో సాంస్కృతిక సమావేశం జరిగింది. సమావేశానికి వేముల యాదగిరి కాంపల్లి సాయిలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో  తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ  సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్లను ఎన్నుకోవడం జరిగింది.

వరంగల్ జిల్లా కన్వీనర్ గా కొయ్యడ రాజేష్,  సిద్దిపేట జిల్లా కన్వీనర్ గా స్వరూప రాణి, లక్ష్మమ్మ,  గద్వాల్ జిల్లా కన్వీనర్ గా యాదగిరి, చంద్రకళ, నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ గా కాంపల్లి సాయిలు, మాడుగుల వెంకటయ్య, మెదక్ జిల్లా కన్వీనర్ గా కొండలు, యాదగిరి, సంగారెడ్డి జిల్లా కన్వీనర్ గా రేణుక భువనగిరి జిల్లా కన్వీనర్లుగా సుగుణమ్మ, లావణ్య, జిల్లా కో -కన్వీనర్లను ఎన్నుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ కోశాధికారి చంద్రన్న ప్రసాద్ తెలంగాణ ఉద్యమ విద్యార్థి జేఏసీ అధ్యక్షులు కంచర్ల బద్రి, మహిళా వేదిక మహిళా వేదిక ప్రధాన కార్యదర్శి లావణ్యతో పాటు 50 మంది ఉద్యమ కళాకారులు నాయకులు పాల్గొన్నారు.