07-07-2025 12:22:58 AM
ముషీరాబాద్, జూలై 6 (విజయక్రాంతి) : దేశంలో అతిపెద్ద అధునాతన అల్యూమినియం సోలార్ ఫ్రేమ్ తయారీ ప్లాంట్‌ను కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు హెచ్ అండ్ హెచ్ అల్యూమినియం ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఉత్తమ్ పటేల్, విజయ్ కనేరియా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యేటా 24 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ దేశంలో 6 గిగావాట్ల సౌర విద్యుత్తు సంస్థాపనకు మద్దతు ఇస్తుందన్నారు.