03-01-2026 07:00:47 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాగజ్ నగర్ మండలం వంజిరి రైతు వేదికలో శనివారం తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా గౌరవ అధ్యక్షుడుగా సిడం రాము,జిల్లా అధ్యక్షుడు జాడి వినోద్ కుమార్,జనరల్ సెక్రటరీగా కోట రవికుమార్,కోశాధికారి రాజేశ్వర్ ను నియమించారు. సంఘాన్ని మొత్తం 18 మంది కార్యవర్గ సభ్యులతో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సంఘం బలోపేతానికి అందరూ కలిసి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.