calender_icon.png 5 January, 2026 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక బహుమతుల దరఖాస్తుల ఆహ్వానం

03-01-2026 07:04:15 PM

జిల్లా సంక్షేమ అధికారి, వేల్పుల విజేత

రఘునాధపాలెం,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలోని దివ్యాంగులు- సకలాంగులు, దివ్యాంగులు- దివ్యాంగులు వివాహం చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం వివాహ ప్రోత్సాహక బహుమతి కింద  రూ 1 లక్ష  మంజూరు చేయబడుతాయని జిల్లా సంక్షేమ అధికారి  వేల్పుల విజేత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివాహం చేసుకున్న జంటలు వివాహం చేసుకున్న తేదీ నుండి సంవత్సరం లోపు http://tgepass.cgg.gov.in అను ప్రభుత్వ వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకొన్నారు.

అట్టి దరఖాస్తు ఒరిజినల్, సంబంధిత జిరాక్స్ పత్రాలు జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కొత్త కలెక్టరేట్ వారి కార్యాలయం రెండవ అంతస్తు ఎస్ 31లో అందజేయాలన్నారు. తదుపరి అట్టి దరఖాస్తులను పరిశీలించి వారి అర్హతను బట్టి సదరు విచారణ అనంతరము నిధులు వచ్చిన వెంటనే నేరుగా బ్యాంక్ అకౌంట్కు జమ చేయటం జరుగుతుందన్నారు. ఇతర వివరములకు జిల్లా సంక్షేమ అధికారి ఖమ్మం కార్యాలయం నందు సంప్రదించగలన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు  అందరూ సద్వినియోగం చేసుకోవాలిని, దీనికి సీలింగ్ లేదని అర్హత ఉన్న ఎంతమంది అయినా దరఖాస్తు చేసుకోవచ్చని   తెలిపారు.