calender_icon.png 26 October, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐక్యత పరపతి సంఘం అధ్యక్షునిగా కుక్కల రాజు

26-10-2025 08:49:05 PM

హన్మకొండ (విజయక్రాంతి): హన్మకొండ జివీఎస్ఆర్ కాలనీ గుండ్ల సింగారం సంబంధించిన ఐక్యత పరుపతి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఐక్యత పరపతి సంఘం నూతన అధ్యక్షునిగా కుక్కల రాజును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం రాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత ఇచ్చిన కాలనీ వాసులకు, కమిటీ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు.

కాలనీ అభివృద్ధి పనులతో పాటు కాలనీ, సమస్యలపైన నిరంతరం పోరాడుతూ, కాలనీ సభ్యులందరి సహకారంతో పొదుపు సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేసుకుంటూ, కాలనీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఉపాధ్యక్షులుగా రుద్రారం ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా తాండూర్ గోపి, ముఖ్య సలహాదారునిగా కుక్కమూడి వంశీ, కోశాధికారిగా వైనాల యాకయ్య, కార్యవర్గ సభ్యులుగా మల్లయ్య, విజేందర్, యుగంధర్, రాము, సుమన్, యుగంధర్ లని ఎన్నుకోవడం జరిగింది.