calender_icon.png 27 October, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగులపల్లి హైవే 44 బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్..

26-10-2025 09:08:27 PM

తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బయ్యర్ కంపెనీ సమీపం నాగులపల్లి బ్రిడ్జి 44వ జాతీయ రహదారిపై మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మహారాష్ట్ర నాగపూర్ నుండి భారీ ట్రయల్ ద్వారా 27,000 కేజీల స్టీల్ కాయిల్ వస్తుండగా తూప్రాన్ నాగులపల్లి బ్రిడ్జిపై రాగానే బిగించిన చైన్ తెగిపోయి కింద పడిపోవడం జరిగింది. ఆ సమయం నుండి చిన్న క్రేన్ ద్వారా లేపే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. సంబంధిత కంపెనీ యాజమాన్యం వారు చేగుంట నుండి భారీ క్రేయిన్ తీసుకొని వచ్చి ట్రైలర్ పై నిలిచి పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా నాగులపల్లి 44వ జాతీయ రహదారి మాసాయిపేట నుండి సంఘటన స్థలం వరకు పూర్తిగా ట్రాఫిక్ తో కూరుకుపోయింది. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.