calender_icon.png 27 October, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని నలుగురికి గాయాలు

26-10-2025 09:18:44 PM

ముగ్గురి పరిస్థితి విషమం.. ఒకరికి తీవ్ర గాయాలు

టేకులపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని దాస్ తండా సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఆదివారం రాత్రి ఢీకొన్నాయి. సంఘటన మండలంలోని మంగలితండా వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం, టేకులపల్లి నుంచి బోడు వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు ముగ్గురు వ్యక్తులు రాంపురం చెందిన కేలోత్ లచ్చిరాం, సక్రు, కేలోత్ నరసింహ, మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. గాయలైన వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. టేకులపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.