10-10-2025 06:03:22 PM
హుజరాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని దీపావళి టపాసుల యూనియన్ నూతన కార్యవర్గం శుక్రవారం స్థానిక హై స్కూల్ గ్రౌండ్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జమాల్ పూర్ అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడి గా ఐతే కిషోర్, ప్రధాన కార్యదర్శి గా బుర్ర కుమార్ గౌడ్, గౌరవ అధ్యక్షుడుగా చొక్కారపు యాదగిరిలతో పాటు కోశాధికారిగా మాడిశెట్టి బాలకృష్ణన్లు ఎన్నికయ్యారు.
అలాగే గౌరవ సభ్యులుగా భూపతి లచ్చన్న, కొమురవేల్లి కిరణ్, గౌతమ్, ముఖ్య సలహాదారులుగా మొలుగు భానుచందర్, గోస్కుల రాజ్ కుమార్ లు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం ఎన్నిక పట్ల సభ్యులందరూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ తనపై నమ్మకం వుంచి అధ్యక్షుడుగా ఎన్నుకున్న సభ్యులందరికీ తన సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.