10-10-2025 10:34:23 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలోని కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న రేంజర్లవార్ శ్రీనివాస్(47) కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. 2004లో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన శ్రీనివాస్ రెండు సంవత్సరాలు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా.. బిచ్కుంద బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేశారు. కోర్టు ప్రాంగణంలో న్యాయవాది శ్రీనివాస్ మృతి పట్ల న్యాయమూర్తి వినీల్ కుమార్ బార్ అసోసియేషన్ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. కోర్టు సిబ్బంది సుదర్శన్ గౌడ్ బార్ అసోసియేషన్ సభ్యులు ప్రకాష్ , లక్ష్మణరావు, మల్లేష్, విట్టల్ రావు, మనోజ్ రాథోడ్, మహమ్మద్, రవి పటేల్, సభ్యులు కోర్టు పోలీస్ సిబ్బంది ఉన్నారు.