10-10-2025 06:06:00 PM
కోదాడ: కోదాడలో కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆళ్ళ భాగ్య రాజ్ చిత్ర పటానికి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శుక్రవారం పూల మాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. చిలుకూరులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొడారు లక్ష్మీనారాయణ రావు ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిలుకూరులో స్వర్గీయ దొడ్డా సురేష్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. చిలుకూరులో గంగి రెడ్డి నర్సి రెడ్డి తల్లి స్వర్గీయ గంగి రెడ్డి ఈశ్వరమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.
నడిగూడెం మండలం, రత్నవరం లో స్వర్గీయ రామిని రవీందర్ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రత్న వరంలో రామిని కృష్ణా రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. నడిగూడెం మండలం, బృందావన పురం లో మాజీ సర్పంచ్ స్వర్గీయ మండవ అంతయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.