calender_icon.png 11 October, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అథ్లెటిక్స్ పోటీలలో బంగారు పతకాలు సాధించిన ఐపిఎస్ విద్యార్థులు

10-10-2025 10:18:53 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో సుల్తానాబాద్  ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు బంగారు పథకాలు సాధించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో 14 సంవత్సరాల బాలుర విభాగంలో ఏం సంప్రిత్ 100, 200 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ జి హర్షవర్ధన్ 600 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్  సాధించారు.

కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు.పతకాలు సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ లు శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడంలో ఐపీఎస్ పాఠశాల ముందుంటుందని, శారీర దారుఢ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు  సత్యనారాయణ,శివ, సతీష్ , మమత పాల్గొన్నారు.